Jangaon: జనగామ జిల్లాను తీసేస్తే బూట్లతో సమాధానం: పల్లా ఫైర్
Jangaon: జనగామ జిల్లాను రద్దు చేసేందుకు కాంగ్రెస్, కడియం శ్రీహరి కుట్రలు చేస్తున్నారని, జిల్లా జోలికొస్తే ఉద్యమకారులు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
Jangaon: జనగామ జిల్లాను తీసేస్తే బూట్లతో సమాధానం: పల్లా ఫైర్
జనగామ జిల్లా: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్.. జనగామ జిల్లా ఎలా వచ్చిందో, ఎంతలా అభివృద్ధికి చేసుకున్నామో జనగామ ప్రజలకు తెలుసు.. కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త మండలాలు చేసుకున్నాం.
ఆనాడు జనగామ జిల్లా రాదానికి వ్యతిరేకించిన కడియం శ్రీహరి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు జనగామ జిల్లాను తీసివేసే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు జిల్లాను తీసివేస్తా అని నువ్వు ఒక్క మాట మాట్లాడితే, 100 మంది జిల్లా ఉద్యమకారులు నీ వెంట పడి బూట్లతో సమాధానం చెప్తారు.
కడియం శ్రీహరి దేవధులను నేనే తీసుకువచ్చిన అని చెప్పుకుంటుండు, ఆయన ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ఉండి దేవధుల తెచ్చిండో చెప్పాలి. కెసిఆర్ ప్రభుత్వంలో చెరువులు బాగుచేసుకుని, అనేక ప్రాజెక్ట్ లు కట్టుకుని నీళ్లు తీసుకువస్తే, చేతగాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు నీళ్లు ఇవ్వడానికి మనసు ఒప్పడం లేదు.
రేవంత్ రెడ్డి మూతి మీద తన్నినట్టు ఆర్టీసీ ఎన్నికలలో కార్మికులు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఏ ఎన్నికలు జరిగినా ఓటర్లను బెదిరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పిచ్చి వేషాలు వేస్తే శంకర గిరి మాన్యాలకు పట్టిస్తాం. రేవంత్ రెడ్డి జాగ్రత్త జనగామ జిల్లా ఒక పోరు గడ్డ, ఇప్పటికైనా సాగు నీరు, కరెంటు సమృద్దిగా ఇవ్వు.




