Jangaon: ఎమ్మెల్యే పల్లాపై కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

Jangaon: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. రాజీనామా చేసి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై పోటీకి రావాలని సవాల్.

MD AHMAD PASHA, JANGAON
Published on: 19 Oct 2026 5:54 PM IST
Jangaon
X

Jangaon: ఎమ్మెల్యే పల్లాపై కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

జనగామ: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రోటోకాల్ పేరుతో జనగామలో రాజకీయాలు చేస్తున్నారని మార్కెట్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న బతుకమ్మ కుంటలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

గత ఏడాది ఇదే బతుకమ్మ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే భార్యకు ఏ ప్రోటోకాల్ ఉందంటూ వేదికపై మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇప్పుడు ప్రోటోకాల్ పేరుతో రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

అలాగే, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపిస్తూ, ఆయనను తెలంగాణ ద్రోహిగా అభివర్ణించారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందన తెలియాల్సి ఉంది.

నిజంగా దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ మల్లిరెడ్డితో పోటీకి రావాలని కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలతో జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON