Jangaon: జనగామలో గణేష్ భక్తులకు మంచినీటి పంపిణీ!
Jangaon: జనగామ ఆర్టీసీ చౌరస్తాలో వినాయక నిమజ్జన భక్తులకు తాగునీటి బాటిల్స్ పంపిణీ చేసిన హమ్ సాత్ ఫౌండేషన్; హాజరైన డీసీపీ రాజమహేంద్ర నాయక్.
Jangaon: జనగామలో గణేష్ భక్తులకు మంచినీటి పంపిణీ!
Jangaon: మతసామరస్యం, సోదరభావం మరియు మానవతా విలువలకు ప్రతీకగా హమ్ సాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకూబ్ పాషా నేతృత్వంలో గణేష్ నిమజ్జనానికి తరలివెళ్తున్న భక్తులకు ఉచితంగా తాగునీటి బాటిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జనగామ ఆర్టీసీ చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనగామ డీసీపీ శ్రీ రాజమహేంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు తాగునీటి బాటిల్స్ అందజేశారు. అలాగే జనగామ ఏసీపీ, టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్సై చెన్నకేశవులు కార్యక్రమంలో పాల్గొని హమ్ సాత్ ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా టీఎస్ మీసా జనగామ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అంకుష్ షావలి మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా గణేష్ నిమజ్జనానికి వెళ్లే భక్తులకు హమ్ సాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకూబ్ పాషా ఆధ్వర్యంలో ముస్లిం సోదరులంతా ఐక్యంగా ఉచిత తాగునీటి బాటిల్స్ పంపిణీ చేస్తూ సేవలందిస్తున్నారని తెలిపారు.
కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా మానవ సేవే మహోన్నతమైన సేవ అనే భావనతో హమ్ సాత్ ఫౌండేషన్ పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల మధ్య పరస్పర గౌరవం, సోదరభావం, మతసామరస్యాన్ని మరింత బలోపేతం చేసే ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హమ్ సాత్ ఫౌండేషన్ సభ్యులు, ముస్లిం సోదరులు, స్థానిక ప్రజలు, సేవా కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గణేష్ భక్తులు పాల్గొన్నారు. నిమజ్జనానికి తరలివెళ్తున్న భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించిన ఫౌండేషన్ సేవను ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మపురి శ్రీనివాస్ మాజి కౌన్సిలర్, మహమ్మద్ సాజిద్ BRS పట్టణ నాయకులు, మహ్మద్ అంకుషావలి, మహమ్మద్ అన్వర్ పాషా, 9th వార్డు కౌన్సిలర్ వెన్నెల రామక్రిష్ణ , మహ్మద్ రిజ్వాన్, మైనారిటీ నాయకులు మహ్మద్ సలీం, అమేర్, అజ్జు , ఆజమ్, మహమ్మద్ ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు




