Jangaon: శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి.. సీపీఎం ఆధ్వర్యంలో నిరసన!
Jangaon: జనగామ జిల్లా కేంద్రంలోని శిథిలావస్థకు చేరిన ప్రధాన బ్రిడ్జికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Jangaon: శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి.. సీపీఎం ఆధ్వర్యంలో నిరసన!
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధానంగా ఉన్నా బ్రిడ్జి శిథిలావస్థకు చేరి కూలిపోయే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ ఆధ్వర్యంలో నాయకులు బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు శిధిలావస్థకు చేరిన బ్రిడ్జికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
శిధిలవస్థ చేరిన బ్రిడ్జిపై రోజు అనేకమంది ప్రయాణాలు చేస్తున్నారని అది కూలిపోయే ప్రమాద దశలో ఉందని అన్నారు. ప్రమాదం జరగకముందుకే నాయకులు మరియు అధికారులు స్పందించాలని కోరారు. సిపిఎం నాయకుల నిరసనతో కిలోమీటరు మేర భారీగా ట్రాఫిక్ స్తంభించగా పోలీసులు నిరసనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు.




