Jangaon: హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన బనుక శివరాజ్ యాదవ్
Jangaon: జనగామ దీక్షా దివస్ సభలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను జనగామ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.
Jangaon: హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన బనుక శివరాజ్ యాదవ్
జనగామ: ఈరోజు జనగామ జిల్లా లో బిఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ అనే కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ గురించి మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా పచ్చి అబద్ధాలు మరియు హరీష్ రావు చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండించిన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్..
శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అప్పటి టీఆర్ఎస్ నేటి బిఆర్ఎస్ పార్టీ ఒక్కటే పోరాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు ?. సంబండ వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడుతూనే ఈ రాష్ట్రం సిద్ధించింది అని గుర్తు చేసుకోవాలని అన్నారు.
హరీష్ రావు గారు ఉద్యమం సమయంలో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం వెతికిన అగ్గిపెట్ట హరీష్ రావు నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. 1200 అమరవీరుల త్యాగఫలమే ఈరోజు మీరు అనుభవిస్తున్న రాజబోగాలు ఒకసారి గుర్తు చేసుకోవాలని అని అన్నారు.
హరీష్ రావు గారు మీ ప్రభుత్వం లో కేసీఆర్ కుటుంబ సభ్యులు మరియు మీరు ఎన్నో అక్రమాలు,కబ్జాలు చేసి అనేక అక్రమ సంపదాలు సంపాదించుకున్నారు కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మాత్రం కన్నీటిని మిగిల్చిన చరిత్ర మీది అని మర్చిపోవద్దు అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో రబ్బర్ చెప్పుల హరీష్ రావు మీరు ప్రభుత్వం లో రాగానే ఎన్ని అక్రమ సంపాదన సంపాదించుకున్న సొమ్ము ఎంతనో దమ్ము ధైర్యం ఉంటే జనగామ అంబేద్కర్ సాక్షిగా చెప్పగలవా అని హరీష్ రావు ని శివరాజ్ యాదవ్ డిమాండ్ చేశారు.
9 సంవత్సరాల మీ పాలనలోనే లక్షల కోట్లు సంపాదించుకున్న కేసీఆర్ కుటుంబం మరియు హరీష్ రావు కుటుంబల అక్రమ సంపాదన ఎంతనో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చెప్పగలవా అని ఎద్దవ చేశారు.
టిఆర్ఎస్ పాలనలో మీ అక్రమ సంపాదన మీ అక్రమాలను తెలంగాణ ప్రజలు ఎండగట్టి కర్రు కాల్చి బుద్ధి చెప్పినా కూడా మీ వైఖరి మారదా??
తొందర్లో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు మీ అక్రమ సంపాదన ,మీ అక్రమలు అన్ని ఒక్కోటి బయటపెట్టి ప్రజల ముందు పూర్తి వివరాలు బహిర్గతం చేస్తారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని అన్నారు. హరీష్ రావు గారు వచ్చే ఎన్నికలో సిద్దిపేట ప్రజలు నిన్ను ఓడించి రాజకీయ సమాధి చేయడం ఖాయం అని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలనే ఆకాంక్షతో ముందుకు పోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బిడ్డ అని బిఆర్ఎస్ నాయకులను హెచ్చరించిన శివరాజ్ యాదవ్...




