Jangaon: గూడూరు ఎస్సీ హాస్టల్ పునరుద్ధరణకు కలెక్టర్ ఆదేశాలు!

Jangaon: జనగామ జిల్లా గూడూరులో నిరుపయోగంగా ఉన్న ఎస్సీ హాస్టల్ భవనాన్ని పునరుద్ధరించాలని బీజేపీ ప్రజావాణిలో కోరగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 26 Oct 2026 5:08 PM IST
Jangaon
X

Jangaon: గూడూరు ఎస్సీ హాస్టల్ పునరుద్ధరణకు కలెక్టర్ ఆదేశాలు!

జనగామ: జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ భవనాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్ సోమవారం జనగామ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూకు వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ తక్షణమే స్పందించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

పేద విద్యార్థుల వసతి కోసం దాతలు ఉచితంగా అందించిన ఎకరం భూమిలో ప్రభుత్వం రూ.21 లక్షల వ్యయంతో నిర్మించిన హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉండటం బాధాకరమని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్సీ బాలుర హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతుండగా, ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం వినియోగంలో లేకపోవడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని తెలిపారు.

భవన స్థితిగతులను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కలెక్టర్ స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో హాస్టల్ సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని రవి కుమార్ చెప్పారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI