Jangaon: మంత్రి పొంగులేటి పర్యటన విజయవంతం చేయాలి: కలెక్టర్

Jangaon: ఈ నెల 26న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం, ప్రెస్టన్ గ్రౌండ్ ఏర్పాట్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 25 Sept 2026 3:03 PM IST
Jangaon
X

Jangaon: మంత్రి పొంగులేటి పర్యటన విజయవంతం చేయాలి: కలెక్టర్

జనగామ జిల్లా: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* ఈ నెల 26న జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

శుక్రవారం, జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం, అలాగే బస్టాండ్ ఎదురుగా గల ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్ లో చేపట్టే ఏర్పాట్లను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పర్యవేక్షించి, పలు సూచనలు చేశారు.

మునిసిపల్ కార్యాలయంలో పైలాన్ల ఏర్పాటు, ఆటో పంపిణీ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

కార్యక్రమం జరిగే ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రపరచాలని, సమావేశానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని 12 మండలాలకు 12 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశానికి హాజరయ్యే ప్రజలకు తగిన సంఖ్యలో కుర్చీలు, బారికేడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.

అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ ప్రోటోకాల్‌కు అనుగుణంగా, ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.

ఈ పర్యవేక్షణలో ఆర్డీఓ గోపీరాం, మునిసిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON