Jangaon: జనగామలో మెగా ఎగ్జిబిషన్‌కు అనుమతులివ్వవద్దు బట్టల వర్తక సంఘం!
Jangaon: జనగామలో దసరా మెగా ఎగ్జిబిషన్‌కు అనుమతులివ్వవద్దని మున్సిపల్ అధికారులకు బట్టల వర్తక సంఘం వినతిపత్రం. నిర్ణయం ఉపసంహరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిక.
Jangaon: జనగామలో మెగా ఎగ్జిబిషన్‌కు అనుమతులివ్వవద్దు బట్టల వర్తక సంఘం!
Jangaon: జనగామ దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని జనగామలో ఏర్పాటు చేయతలపెట్టిన మెగా ఎగ్జిబిషన్ సేల్‌కు అనుమతులు ఇవ్వవద్దని కోరుతూ జనగామ బట్టల వర్తక సంఘం ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్‌లకు వినతి పత్రం అందజేశారు.
ఇప్పటికే కార్పొరేట్ వ్యవస్థల దెబ్బకు నష్టపోతున్న స్థానిక చిరు, మధ్యతరగతి వ్యాపారులు, ఇలాంటి మేళాల వల్ల మరింత ఆర్థికంగా కుంగిపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కిరాయిలు కడుతూ జీవనం సాగిస్తున్న తమ ఉపాధిని దెబ్బతీసేలా ఉన్న ఈ ఎగ్జిబిషన్ అనుమతులను నిలిపివేయాలని లేని యడల మరో ఉద్యమం తప్పదు అని వారు హేచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం శాశ్వత అధ్యక్షులు అన్వర్, గౌరవ అధ్యక్షులు గాడిపల్లి బాలరాజు, అధ్యక్షులు భోగ కైలాసం, ప్రధాన కార్యదర్శి ఆమంచ రవి కుమార్ కోశాధికారి గాడిపల్లి కిషోర్ కుమార్, ఉపాధ్యక్షులు కేమిడి ఉపేందర్ తదితర కార్యవర్గ సభ్యులు మరియు వ్యాపారస్తులు పాల్గొన్నారు.




