Jangaon: జనగామలో బీజేవైఎం నిరసన నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు భర్తీ చేయాలి!

Jangaon: జనగామలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై ఆందోళన. ఏటా 2 లక్షల ఉద్యోగాలు, రూ.4000 నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి.

MD AHMAD PASHA, JANGAON
Published on: 17 Oct 2026 5:34 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో బీజేవైఎం నిరసన నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు భర్తీ చేయాలి!

జనగామ: జనగామ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యపై నిరసన కార్యక్రమం చేపట్టారు. జనగామ చౌరస్తాలో ఆందోళన చేపట్టి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

BJYM జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ముందు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఏటా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు రూ. 4000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, బీజేపీ అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని నాయకులు అన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON