Jangaon: జనగామలో ఘనంగా బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశాలు

Jangaon: జనగామలో ఘనంగా బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశం. నూతన కార్యవర్గానికి నియామక పత్రాల పంపిణీ.. హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్.

MD AHMAD PASHA, JANGAON
Published on: 31 Oct 2026 6:20 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో ఘనంగా బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశాలు

జనగామ: స్థానిక జనగామ జిల్లా లో భారతీయ జనతా పార్టీ బిజెపి కార్యాలయంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బీజేవైఎం జనగామ జిల్లా అధ్యక్షులు ఎల్లబోయిన హరీష్ యాదవ్ గారు అధ్యక్షత వహించగా బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు బీజేవైఎం కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

పార్టీ ఎదుగుదలకు భారతీయ యువ మోర్చా బీజేవైఎం ముఖ్య భూమిక పోషిస్తుందని అన్నారు ఈరోజు దేశంలో గాని రాష్ట్రంలో గాని పెద్ద నాయకులందరూ ఒకప్పుడు యువమోర్చ్ లో పనిచేసిన వారిని గుర్తు చేశారు క్రమశిక్షణ కలిగిన పార్టీ అనుబంధ యువర్ మోర్చా మీరందరూ బాధ్యత తీసుకోవడం రాబోయే తరం తీర్చిదిద్దినట్లు అయిందని అన్నారు.

యువత తలుచుకుంటే ప్రభుత్వాలే మార్చిన పరిస్థితి ఉందని అన్నారు రాబోయే రోజులలో యువమోర్చా నాయకులు అందరూ కలిసి భారతీయ జనతా పార్టీ సూచన మేరకు పెద్ద ఎత్తున యుద్ధం చేయాలని అని అన్నారు. మీరందరూ ఇప్పుడు తీసుకున్నటువంటి పదవులు కాకుండా బాధ్యతగా ఫీలై బాధ్యతాయుతంగా ఉండాలని గుర్తు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన బీజేవైఎం కార్యవర్గానికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో బీజేవైఎం జనగామ జిల్లా ఇన్చార్జ్ శివచంద్ర గిరి బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి చింతకింది సంతోష్ యాదవ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శిలు, గణేష్, శ్యామ్, మరియు బీజేవైఎం ఉపాధ్యక్షులు కార్య దర్శులు అధికార ప్రతినిధులు వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON