Jangaon: చౌక ధరల దుకాణాల్లో సరుకులు అందించాలి: డీఎస్వోకు వినతి!

Jangaon: జనగామ జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని పౌరసరఫరాల అధికారి సురేష్ రెడ్డికి ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 14 Oct 2026 6:29 PM IST
Jangaon
X

Jangaon: చౌక ధరల దుకాణాల్లో సరుకులు అందించాలి: డీఎస్వోకు వినతి!

జనగామ: జనగామ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇరీ అహల్య ఎండి షబానా పౌరసరఫరాల అధికారి గారికి అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో చౌక ధరల దుకాణాల ద్వారా 14 రకాల నిత్యవసర సరుకులను పేద ప్రజలకు అందించాలని పౌర సరఫరాల అధికారి సురేష్ రెడ్డి గారికి వినతి పత్రం అందించడం జరిగింది.

ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇర్రి అహల్య MD షబానా గారలు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అసంఘటిత రంగ కార్మికులు వ్యవసాయ కూలీలు తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు తమ సంపాదనలో అధిక భాగాన్ని ఆహారం నిత్యవసర సరుకుల కొనుగోలికే ఖర్చు అవుతుందని.

నిత్యం మార్కెట్లో పెరుగుతున్న ధరల కారణంగా కుటుంబ అవసరాలను తీర్చకపోవడం భారంగా మారుతుందని అన్నారు ముఖ్యంగా కుటుంబ నిర్వహణ బాధ్యతలు మోస్తున్న మహిళలు ఇంటి ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని పిల్లలకు పోషకాహారం అందించడం కుటుంబానికి అవసరమైన పప్పులు వంటనూనెలు ఇతర నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడం కష్టంగా మారుతుందని ఆదాయానికి ఖర్చులకు మధ్య అంతరం పెరుగుతుండడంతో పేద కుటుంబాల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ప్రజలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాబట్టి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యంతో పాటు ఇతర నిత్యవసర 14 రకాల సరుకులను పేద మధ్యతరగతి ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముసిపట్ల జయ సుంచు శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON