Hasanparthy: హసన్‌పర్తి మీడియా పాయింట్ అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్ ఎన్నిక!

Hasanparthy: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల మీడియా పాయింట్ అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సందెల సాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 11 Nov 2026 5:13 PM IST
Hasanparthy
X

Hasanparthy: హసన్‌పర్తి మీడియా పాయింట్ అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్ ఎన్నిక!

Hasanparthy: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల మీడియా పాయింట్ నూతన అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎర్రగట్టుగుట్ట కళ్యాణ మండపంలో మంగళవారం మండల జర్నలిస్టులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా జక్కుల విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సందెల సాగర్, ఉపాధ్యక్షులుగా, కోప్పుల రాజేందర్, దాడి బిక్షపతి, సందెల రాజు, కోశాధికారిగా దాడి చిరంజీవి, సహాయ కోశాధికారిగా మండ రాజేష్, కార్యదర్శులుగా బొక్క రాజు, వాజిద్, సహాయ కార్యదర్శులుగా రామంచ మధుకర్, చెన్నూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.అదేవిధంగా సలహాదారులుగా సయ్యద్ అహ్మద్, దండుగూడెం రాజకుమార్, కార్యవర్గ సభ్యులు గా రేణికుంట్ల దుర్గాప్రసాద్, రాజారపు భిక్ష పతి,ఎర్ర కుమార స్వామి,పెసరు సూర్య ప్రకాష్,చెంగేల్లి నరేష్ చారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యతకు పెద్దపీట వేస్తానని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా పాయింట్ సభ్యులు.. కే కార్తీక్, బండారి సుమన్, పత్తిపాక విష్ణుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.