Burgupe: బూర్గుపేట ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ!

Burgupeta: వెంకటాపూర్ మండలం బూర్గుపేట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 7 Oct 2026 5:49 PM IST
Burgupe
X

Burgupe: బూర్గుపేట ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ!

బూర్గుపేట: వెంకటాపూర్ మండలంలోని బూర్గుపేట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సందర్శించి పాఠశాలలోని విద్యా పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించిన పీఓ విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయి, విద్యా ప్రగతిని తెలుసుకున్నారు. విద్యార్థుల నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, తరగతి బోధనకు సంబంధించిన అంశాలను పరిశీలించి, విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపాలని సూచించారు.

అనంతరం పాఠశాలలోని డార్మిటరీని పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న వసతి సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాల రికార్డులు, విద్యా సంబంధిత పుస్తకాలు, ఇతర నిర్వహణ అంశాలను కూడా పరిశీలించి, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు సమర్థవంతంగా అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదల, క్రమశిక్షణ, హాజరు, ఆరోగ్యం మరియు వసతి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అనుకూలమైన విద్యా వాతావరణం కల్పించేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.