Hanamkonda: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి!
Hanamkonda: కేంద్ర ఎన్నికల సంఘం లొంగుబాటుపై INDIA కూటమి పోరాటం సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని హనుమకొండలో తీర్మానం అక్టోబర్ 5న భారీ పాదయాత్రకు పిలుపు.
Hanamkonda: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి!
హనుమకొండ, అక్టోబర్ 3: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకుని ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని, పౌరుల ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి INDIA కూటమి శ్రేణులన్నీ కదంతొక్కాలి అని హనుమకొండ జిల్లా ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు.
శనివారం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో హనుమకొండ DCC అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన INDIA కూటమి పార్టీల సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు అక్టోబర్ 2 నుండి 8 వరకు నిర్వహిస్తున్న "ప్రజాస్వామ్య పరిరక్షణ వారం" లో భాగంగా ఈ ప్రెస్ మీట్ జరిగింది. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు, డిసిసి మీడియా & కమ్యూనికేషన్ కమిటీ ఛైర్మన్ మార్క విజయ్ కుమార్, CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాస్ రావు,CPM జిల్లా కార్యదర్శి G ప్రభాకర్ రెడ్డి, న్యూ డిమాక్రసీ జిల్లా కార్యదర్శి నున్నా అప్పారావు,TJS అధ్యక్షులు చిల్లా రాజేంద్ర ప్రసాద్,CPI జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి,వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ దుద్దిల్ల శ్రీను బాబు మరియు కూటమి నేతలు పాల్గొన్నారు.
ఉద్దేశించి మాట్లాడుతూ: కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి వీడి, స్వతంత్రంగా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తేదీన (సోమవారం) ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా హనుమకొండలోని డా. బి.ఆర్. అంబేద్కర్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు INDIA కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ర్యాలీ ముగింపులో సార్వత్రిక వయోజన ఓటుహక్కును కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ను బహిరంగంగా చదివి వినిపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల యువజన సంఘాలు,విద్యార్థి సంఘాలు,ప్రజాస్వామిక వాదులు,అన్ని అనుబంధ సంఘాలు,ప్రతి పౌరుడు బాధ్యతగా హాజరు కావాలని,ఇట్టి కార్యక్రమానికి కాలేజీ యాజమాన్యాలు సహకరించాలని కోరారు..అక్టోబర్ 6 నుండి 8వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాలు, మరియు డివిజన్ల వారీగా INDIA కూటమి పార్టీలతో కలిసి సంయుక్త సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని, క్షేత్రస్థాయి కార్యకర్తలను సమీకరించి జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ మేరా కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ సంగ వెంకట్రాజం, వరంగల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పులి ప్రియాంక అనిల్, హనుమకొండ మహిళా అధ్యక్షురాలు బంక సరళ సంపత్, ఐఎన్ టియుసి నాయకులు కూర వెంకట్, సొసైటీ ఛైర్మన్ లు పింగిలి వెంకట్రామ్ నరసింహ రెడ్డి, గంగుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పోలెపెళ్లి బుచ్చి రెడ్డి, వీసం సురేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్, మాజీ కార్పొరేటర్ బోడ డిన్న, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




