Jangaon: జనగామలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో 'ఓట్ చోరీ బచావో' ర్యాలీ!

Jangaon: జనగామలో బీజేపీ హటావో ఓట్ చోరీ బచావో నినాదంతో ఇండియా కూటమి నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 6 Oct 2026 5:24 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో 'ఓట్ చోరీ బచావో' ర్యాలీ!

Jangaon: బీజేపీ హటావో ఓట్ చోరీ బచావో అనే నినాదంతో జనగామలో ఇండియా కూటమి నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు జనగామ రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

జనగామ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతూ వరుసగా అధికారంలోకి వస్తోందని ఆరోపించారు బీజేపీకి అనుకూలంగా సీఈసీ ఓట్లను తొలగిస్తోందని విమర్శించారు. సీఈసీపై చర్యలు తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి, సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి, నాయకులు బూడిద గోపి తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON