Inavolu: రోడ్లు వేయమంటే అరెస్టులా?: తెలంగాణ బొమ్మ వద్ద సీపీఎం ధర్నా!
Inavolu: రోడ్డు వేయాలని వాట్సాప్‌లో పోస్ట్ పెట్టిన యువకుల అక్రమ అరెస్టును ఖండిస్తూ హనుమకొండ జిల్లా అయినవోలు తెలంగాణ బొమ్మ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
Inavolu: రోడ్లు వేయమంటే అరెస్టులా?: తెలంగాణ బొమ్మ వద్ద సీపీఎం ధర్నా!
అయినవోలు: అయినవోలు, కాజీపేట నుండి కొండపర్తి. ములకలగూడెం మీదుగా గుంటూరుపల్లి అయినవోలు వరకు రోడ్డును వేయాలని వాట్సాప్ లో పెట్టినందుకు ముగ్గురి యువకుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ రావడానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య తీవ్రంగా ఖండించి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈరోజు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో అరెస్టు చేసిన కొండపర్తి యువజన సంఘాలకు చెందిన కట్కూరి నెల్సన్ కట్కూరి శ్రావణ్ కుమార్. అల్లందాస్ తరుణ్ గార్లు వాళ్ల గ్రామ వాట్సప్‌లో మూడు సంవత్సరాలు అవుతున్న రోడ్లు వేయడం లేదని గ్రూప్ లో పెట్టినందుకు వారిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో రూమ్‌లో వేసి డోర్లు వేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కాడబోయిన లింగయ్య అన్నారు.
గత ప్రభుత్వం హయాంలో రోడ్లు సాంక్షన్ అయ్యి తవ్వి కంకర పోసి మూడు సంవత్సరాలు అవుతున్న నేటి వరకు రోడ్డు వేయకపోవడంతో అనేకమంది వాహనదారులు ఈ రోడ్డుపై పడి గాయాల పాలయి హాస్పటల్లో చేరాలని అలాంటి రోడ్డు వేయకపోవడం దుర్మార్గమైన చర్య అని లింగయ్య అన్నారు. ఈ రోడ్లు వేయమని గతంలో కొండపర్తి ప్రజలు సిపిఎం పార్టీ. ప్రజా సంఘాలు అనేక సందర్భాల్లో ఆందోళనకు దిగినప్పటికీ ఆ రోడ్డు వేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు.
వెంటనే అరెస్టు అయిన వారిని విడుదల చేయాలని ఆ రోడ్డు పనులు ప్రారంభించాలని కాడబోయిన లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకుంటే అన్ని రాజకీయ పార్టీలను. ప్రజా సంఘాలను సమీకరించి ఆందోళన దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గుండెకారి మహేందర్. కే నారాయణ రెడ్డి .గబ్బెట రామ్ కుమార్.మడిగ నాగరాజు. గుండెకారి బాబురావు గుండెకారి రాజేశ్వరరావు . లెంకల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.




