Jangaon: జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు: ఐజేయూ

Jangaon: జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ఐజేయూ పిలుపు మేరకు అక్టోబర్ 2న జనగామ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టనున్నారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 1 Oct 2026 3:24 PM IST
Jangaon
X

Jangaon: జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు: ఐజేయూ

జనగామ: జర్నలిస్టుల హక్కులు, భద్రత, సామాజిక, ఆర్థిక సంక్షేమం కోసం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) పిలుపు మేరకు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ‘డిమాండ్ల దినోత్సవం’ను విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే–ఐజేయూ జనగామ జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురిగల బిక్షపతి పిలుపునిచ్చారు.

జనగామలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ..

రేపు ఉదయం 10 గంటలకు జనగామలోని నెహ్రూ పార్క్ వెళ్లే మార్గంలో, కళ్యాణ్ సిల్క్స్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఉన్న గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ఆందోళన నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

మీడియా రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక జాతీయ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, జర్నలిస్టేతర మీడియా సిబ్బందికి ప్రస్తుత జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు కల్పించేందుకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని, ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించి నగదు రహిత వైద్య చికిత్స సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పార్నంది వెంకటస్వామి, కోశాధికారి ఓరుగంటి సంతోష్, టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు కెమిడి ఉపేందర్, ప్రధాన కార్యదర్శి పసునూరి గణేష్, బొల్లు ఎల్లారెడ్డి, కొత్తపల్లి కిరణ్, వంగ శ్రీకాంత్ రెడ్డి, శేషత్వం ఆనంద్, సందేన రమేష్, జంపాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON