Hyderabad: చుక్కా రామయ్యకు 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి!

Hyderabad: ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు చుక్కా రామయ్య 101వ జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విద్యానగర్ నివాసంలో కలిసి సత్కరించారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 20 Nov 2026 12:01 PM IST
Hyderabad
X

Hyderabad: చుక్కా రామయ్యకు 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి!

హైదరాబాద్: చుక్కా రామయ్య 101 వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్, విద్యానగర్ లోని చుక్కా రామయ్య గారి నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థులు ఐఐటీ పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో స్థిరపడడానికి కారణం చుక్కా రామయ్య గారు అని కొనియాడారు.

విద్యా ప్రదాత కాకుండా తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తన పాత్ర పోషించాడని ఆయన అన్నారు. అలాంటి చుక్కా రామయ్య గారు 101వ పుట్టిన రోజు జరుపుకోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI