Mahabubabad: ఎల్ నినో ప్రభావం, మామిడి సస్యరక్షణపై రైతులకు అవగాహన!

Mahabubabad: మహబూబాబాద్ ఏటిగడ్డ తండా రైతు వేదికలో ఎల్ నినో వర్షాభావ పరిస్థితులు, మామిడిలో మేలైన సస్యరక్షణ చర్యలపై ఉద్యానవన శాఖ రైతులకు అవగాహన కల్పించింది.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 3 Nov 2026 4:42 PM IST
Mahabubabad
X

Mahabubabad: ఎల్ నినో ప్రభావం, మామిడి సస్యరక్షణపై రైతులకు అవగాహన!

Mahabubabad: ఎల్ నినో వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన మరియు మామిడిలో మేలైన యాజమాన్య పద్దతులు, సస్యరక్షణ పై అవగాహన ఎల్ నినో వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన మరియు మామిడిలో మేలైన యాజమాన్య పద్దతులు, సస్యరక్షణ పై జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహబూబాబాద్ పట్టణ శివారులోని ఏటిగడ్డ తండ రైతు వేదిక నందు ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు అవగాహన పరిచారు.

ఈ సందర్బంగా మామిడి చెట్టు బెరడులో ఉన్న తేనె మంచు పురుగులను నివారించడానికి ఎసిఫేట్ @ 1.5 గ్రా./లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ @ 0.3 మి.లీ./లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలని పక్షి కన్ను తెగులు గమనిస్తే, కార్బెండజిమ్ మందును 1 గ్రా./లీ. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని అన్నారు.

పొటాషియం నైట్రేట్ (13-0-45) @ 10 గ్రా./లీ. లేదా మోనో పొటాషియం ఫాస్ఫేట్ (00-52-34) @ 10 గ్రా./లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలని, పూత వచ్చే వరకు మామిడి తోటకు నీరు పెట్టడం ఆపివేయాలని అన్నారు. బోర్లు, బావుల క్రింద కూరగాయలు, ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, పసుపు,మల్బరీ, మునగ, పండ్లు, పూలు సాగు చేస్తూ మన జిల్లా రైతులు ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం పొందుతున్నారన్నారు.

యాసంగి సీజన్లో వరి వేయవద్దు..ఉద్యాన(ఆరుతడి) పంటల సాగు మేలు. విద్యుత్, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, బిందు సేద్య, ఎత్తు మడులుమొదలైనవి, మల్చింగ్ పద్ధతులు మేలని ఈ సందర్బంగా రైతులకు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనివాస రావు, వ్యవసాయ అధికారులు N తిరుపతి రెడ్డి, B.రాంజీ , ఉద్యాన అధికారులు, A.J. శాంతి ప్రియదర్శిని, M. స్రవంతి, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు లయ, B.పున్నమి, సరిత, B.బాలాజీ మరియు రైతులు పాల్గొన్నారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD