Hanamkonda: ప్రళయ రుద్రునిగా దర్శనమిచ్చిన చారిత్రక రుద్రేశ్వర స్వామి!
Hanamkonda: చారిత్రక రుద్రేశ్వరాలయంలో కార్తీకమాసోత్సవాల్లో భాగంగా 18వ రోజు శుక్రవారం స్వామివారిని ప్రళయ రుద్రునిగా అలంకరించి 11 కిలోల నెయ్యితో రుద్రాభిషేకం, మహా అన్నపూజ నిర్వహించారు.
Hanamkonda: ప్రళయ రుద్రునిగా దర్శనమిచ్చిన చారిత్రక రుద్రేశ్వర స్వామి!
Hanamkonda: చారిత్రక రుద్రేశ్వరాలయంలో కార్తీకమాసోత్సవాల్లో భాగంగా 18వ రోజు శుక్రవారం ఉదయం కార్యక్రమాలు నిర్వర్తించి సంకటహర చతుర్థిని పురస్కరించుకొని ఉత్తిష్ఠ గణపతికి చెరుకు రసంతో అభిషేకం నిర్వర్తించి గరిక పూజ నిర్వర్తించిన అనంతరం రుద్రే శ్వరునికి 11 కిలోల నెయ్యితో రుద్రాభిషేకం నిర్వర్తించనైనది.
పరమ శివ భక్తులైన రఘుపతి రెడ్డి మౌనిక దంపతుల ఆధ్వర్యంలో 51 కిలోల పెరుగు అన్నం మిరియాలపొడితో కలిపి అన్న సూక్త ,లక్ష్మీ సూక్త మూల మంత్ర పఠనంతో మహా అన్నపూజ నిర్వర్తించి స్వామివారిని ప్రళయ రుద్రునిగా అలంకరించి శివ ద్వాదశ నామాలతో స్వామివారిని పూజించి నిరాజనా మంత్రపుష్పాల అనంతరం ఆలయ ప్రాంగణంలో ఇరువురు దంపతుల ఆధ్వర్యంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం కార్తీక దామోదర అంటూ కార్తీక సమారాధన వేలాదిమంది భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగినది.
ఈరోజు వందలాది మంది భక్తులు రావి చెట్టు దగ్గర ధాత్రి నారాయణస్వామి ఉసిరి చెట్టు దగ్గర ఉసిరి దీపాలు వెలిగించుకున్నారు. శివుడి హృదయం విష్ణువు విష్ణు హృదయం శివుడు విష్ణువు శివమయుడైన విధంగానే శివుడు విష్ణుమయుడు అన్నారు తత్వవేత్తలు శివకేశవ అబేద భావన అనేది అద్భుతం వేదాలను విభాగం చేసి విడదీసిన వేద వ్యాస మహర్షి విష్ణువును శివుడిని ఏకం చేసి హరిహరుడు అనే సంయుక్త రూప తత్వాన్ని ఆవిష్కరించాడు ఆ మహత్తర తత్వాన్ని అందిపుచ్చుకొని కపి బ్రహ్మ తిక్కన సోమయాజి పరిహారనాథ తత్వాన్ని స్థాపన చేశారు.
ఆరోగ్యాన్ని సూర్యుడి నుంచి ఐశ్వర్యాన్ని అగ్ని నుంచి జ్ఞానాన్ని పరమేశ్వరుని నుంచి మోక్షాన్ని విష్ణు గురించి కోరుకోవాలి. అంటూ స్పష్టంగా నిర్దేశిస్తున్న ఈ తాత్విక శాస్త్రం బ్రహ్మ నుంచి ఏం కోరుకోవాలో సెలవియ్యలేదు అందుకే హరిహర అద్వైతం ఆవిర్భవించింది అనిష్ఠ సమాప్తికి ఇష్టప్రాప్తికి మానవుడు శివకేశవ ఐక్య రూపాన్ని ఆరాధించవచ్చు. తనకు నచ్చిన శివరూపాన్ని లేదా తను మెచ్చిన విష్ణురూపాన్ని అయినా ఆరాధించవచ్చు
ఈరోజు పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ వేద పండితుడు మణికంఠ శర్మ అర్చకులు దత్త కుమార్ ప్రణవ్ నిర్వహించారు ఆలయ ఈవో డి అనిల్ కుమార్ సేవా దృక్పథంతో అన్న ప్రసాద వితరణ చేశారు.
రేపు తేదీ 28/11/26 పంచమి శనివారం దామోదర ప్రీత్యార్థం సత్యనారాయణ స్వామి వ్రత కథలో వివరించిన విధంగా మారేడు వృక్షం కింద రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది 516 రూపాయలు చెల్లించి రసీదు పొందిన వారికి పూజా సామాగ్రి ఉచితంగా అందజేయబడును రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం అవునని ఈవో అనిల్ కుమార్ తెలియజేశారు.




