Mahabubabad: డోర్నకల్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగిపొర్లుతుండటంతో పత్తి మిరప పంటలు నీట మునిగాయి.
Mahabubabad: డోర్నకల్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు!
Mahabubabad: డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షాలతో కుంటలు, చెరువులు క్రమంగా నిండుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీటితో పత్తి, మిరప తోటలు తడిసి ముద్దయ్యాయి.
సీరోలు మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగు సమీపంలో నీటి ప్రవాహం పెరగడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఒకవైపు ఆనందం వ్యక్తమవుతుండగా, మరోవైపు పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది.




