Hanumakonda: హనుమకొండ వ్యాప్తంగా విద్యాసంస్థల్లో క్లీన్ అండ్ గ్రీన్ పనులు!
Hanumakonda: హనుమకొండ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, గురుకులాల్లో వారం రోజులుగా పారిశుద్ధ్య, క్లీన్ అండ్ గ్రీన్ పనులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Hanumakonda: హనుమకొండ వ్యాప్తంగా విద్యాసంస్థల్లో క్లీన్ అండ్ గ్రీన్ పనులు!
Hanumakonda: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని జిల్లా లో అన్నీ పాఠశాలలు, కళాశాల లు పచ్చదనం, పరిశుభ్రం గా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
జిల్లా లోని అన్నీ సంక్షేమ, గురుకుల పాఠశాల, కళాశాల ఆవరణలో ఎలాంటి చెత్త చెదారం, పిచ్చి మొక్కలు లేకుండా చేయాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు గత వారం రోజుల నుండి అన్నీ సంక్షేమ శాఖల అధికారులు, స్పెషల్ అధికారులు వారి పరిధిలో గల సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాల లలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు.
విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వారి ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని స్వచ్ఛమైన, సురక్షితమైన వాతావరణన్ని కూడా అందించాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.
పాఠశాలల పరిసరాల్లో పిచ్చి మొక్కలను, చెత్తాచెదారం తొలగించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు నివసించే డార్మిటరీ గదులు, చదువుకునే తరగతి గదులు, కిచెన్ రూమ్ లు,టాయిలెట్లు, బాత్రూమ్‌లని ఇలా అన్ని పరిశుభ్రంగా ఉండేలా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
గురుకులాల్లో,పాఠశాలల్లో ఇలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం ద్వారా విద్యార్థులు సీజనల్ వ్యాధుల (డెంగ్యూ, మలేరియా) బారిన పడకుండా ఆరోగ్యంగా విద్యాభ్యాసం కొనసాగించగలుగుతారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




