Hanumakonda: ఆత్మకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: పాల వ్యాన్ డ్రైవర్ మృతి!
Hanumakonda: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని పాల వ్యాన్ ఢీకొన్న ఘటనలో ధర్మసాగర్‌కు చెందిన శరత్ మృతి. కేసు నమోదు.
Hanumakonda: ఆత్మకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: పాల వ్యాన్ డ్రైవర్ మృతి!
హనుమకొండ జిల్లా: ఆత్మకూరు మండలం గూడెప్పాడు ఎన్ ఎస్ ఆర్ హోటల్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న శక్తి డైట్ మిల్క్ వాహనం, రాపాక పల్లి ధర్మసాగర్ మండలం హనుమకొండ జిల్లా కు చెందిన కనకం శరత్ 28 సంవత్సరాలు మృతి.
లారీ డ్రైవర్ ఎటువంటి సూచనలు మరియు సంకేతాలు లేకుండా ఆ జాగ్రత్తగా నిర్లక్ష్యంగా లారిని నిలిపివేయడం వలన తన కొడుకు చనిపోయాడని మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




