Parkal: కిరాణం మాటున అక్రమ మద్యం విక్రయాలు: స్థానికుల ఆగ్రహం!
Parkal: హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని సాయి నగర్ కాలనీలో కిరాణం షాపు మాటున యథేచ్ఛగా బెల్ట్ షాపు నడుపుతున్నారని, అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Parkal: కిరాణం మాటున అక్రమ మద్యం విక్రయాలు: స్థానికుల ఆగ్రహం!
పరకాల: పరకాల పట్టణంలోని సాయి నగర్ కాలనీలో బెల్ట్ షాప్ దందా యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.పేరుకు కిరాణం షాప్ నడిపిస్తూ చాటుగా రాత్రి పగలు తేడా లేకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు పాఠశాల పక్కనే ఉండటం, బెల్ట్ షాప్ కారణంగా కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని, మహిళలు, చిన్నారులు బయట తిరగాలంటే భయపడుతున్నారని వాపోతున్నారు.ఎక్సైజ్, పోలీస్ అధికారులు స్పందించి బెల్ట్ షాప్ పై చర్యలు తీసుకొని కాలనీలో శాంతి భద్రతలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.




