Hanumakonda: ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి.. దరఖాస్తులు పెండింగ్ వద్దు!
Hanumakonda: హనుమకొండ జిల్లా పరకాల ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయి సమీక్ష నిర్వహించి రెవెన్యూ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు.
Hanumakonda: ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి.. దరఖాస్తులు పెండింగ్ వద్దు!
హనుమకొండ: రెవిన్యూ కి సంబందించిన దరఖాస్తులని వేగవంతం గా పరిష్కరించాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. గురువారం పరకాల ఆర్డీ వో కార్యాలయం లో వివిధ అంశాల మీద శాసనసభ్యులు, కలెక్టర్ సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించాలన్నారు.
అలాగే భూ రీ సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలనీ తెలిపారు. రెవిన్యూ కి సంబందించిన ఏ ఒక్క దరఖాస్తు పెండింగ్ లో ఉండకుండా క్షేత్ర స్థాయి లో విచారణ జరిపించి దరఖాస్తు దారులకు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశం లో ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.




