Hanumakonda: పోచారంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల వద్ద ఉద్రిక్తత!
Hanumakonda: హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను రైతులు అడ్డుకున్నారు. పరిహారం ఇవ్వకుండా సర్వే చేస్తున్నారని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hanumakonda: పోచారంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల వద్ద ఉద్రిక్తత!
హనుమకొండ: హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకుని నిరసనకు దిగారు.
తమ పంట భూములు నష్టపోతామని, సరైన పరిహారం లేకుండా పనులు చేయడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా హడావుడిగా సర్వే చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు వెనక్కి తగ్గలేదు. పూర్తి వివరాలు వెల్లడించి, న్యాయమైన పరిహారం ప్రకటించే వరకు సర్వేను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
నష్టపరిహారం ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మా భూములు పంటచేలు ధ్వంసం చేస్తున్నారని హైకోర్టు ఆర్డర్ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇంకా సమయం ఉన్న లెక్కచేయకుండా పంటలను ధ్వంసం చేశారని అన్నారు.
మెగా కృష్ణారెడ్డి ఆర్థిక బలంతో రైతులను నిండా ముంచుతూ సారవంతమైన నేలను ధ్వంసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మెగా కృష్ణారెడ్డికి ఈ ప్రాజెక్టు దారాదత్తం చేస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్కు ఖర్చులు పెరిగినవని ప్రభుత్వం 4000 కోట్లు అదనంగా మంజూరు చేసిందని రైతులకు మాత్రం రెండు కోట్లు ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు పెడుతుందన్నారు. చేతికొచ్చిన పంటని నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పడంతో వేచి చూస్తున్నామన్నారు.




