Hanumakonda: భూముల రీ-సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్, ఆర్డీఓ!

Hanumakonda: హనుమకొండ జిల్లా కామారెడ్డిపల్లి గ్రామంలో భూముల రీ-సర్వే ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓ వెంకన్న. రైతులు సహకరించాలని విజ్ఞప్తి.

M PRABHAKAR, PARAKAL
Published on: 9 Oct 2026 6:46 PM IST
Hanumakonda
X

Hanumakonda: భూముల రీ-సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్, ఆర్డీఓ!

Hanumakonda: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి , పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న కామారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, గ్రామ సరిహద్దులు, గ్రామానికి సంబంధించిన వివరాలు, ఇప్పటివరకు నిర్వహించిన సర్వే పురోగతి తదితర అంశాలపై సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సర్వే ప్రక్రియపై ముందస్తు సమాచారం అందిస్తూ, రీ-సర్వేను పారదర్శకంగా, సమన్వయంతో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. రీ-సర్వే కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యేందుకు రైతులందరూ అధికారులకు, సర్వే సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల మండల తహసీల్దార్ టి. విజయలక్ష్మి, మండల సర్వేయర్ విజయ్ కుమార్, అదనపు గిర్దావర్ ఖయ్యూం, గ్రామ పాలన అధికారి లావణ్య, సర్వే సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL