Hanumakonda: NHM ఉద్యోగాలకు భారీ స్పందన: 51 పోస్టులకు 2,530 దరఖాస్తులు!

Hanumakonda: హనుమకొండ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం కింద 51 వైద్య ఆరోగ్య పోస్టులకు గాను 2,530 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అందినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 16 Oct 2026 9:19 PM IST
Hanumakonda
X

Hanumakonda: NHM ఉద్యోగాలకు భారీ స్పందన: 51 పోస్టులకు 2,530 దరఖాస్తులు!

హనుమకొండ: హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కార్యక్రమం కింద వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో మొత్తం 51 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆయా పోస్టులకు మొత్తం 2,530 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

పోస్టుల వారీగా అందిన దరఖాస్తుల వివరాలు

పీడియాట్రిషియన్ / మెడికల్ ఆఫీసర్: 4 పోస్టులకు 51 దరఖాస్తులు.

మెడికల్ ఆఫీసర్ (బ్లడ్ బ్యాంక్): 1 పోస్టుకు 33 దరఖాస్తులు.

స్టాఫ్ నర్సులు: 12 పోస్టులకు 922 దరఖాస్తులు.

ఏఎన్‌ఎంలు (ANM): 16 పోస్టులకు 467 దరఖాస్తులు.

మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు (MLHP): 8 పోస్టులకు 364 దరఖాస్తులు.

ల్యాబ్ టెక్నీషియన్లు: 5 పోస్టులకు 335 దరఖాస్తులు.

ఫార్మసిస్టులు: 2 పోస్టులకు 308 దరఖాస్తులు.

సైకియాట్రిస్ట్: 1 పోస్టుకు 3 దరఖాస్తులు.

ల్యాబ్ మేనేజర్: 1 పోస్టుకు 27 దరఖాస్తులు.

ఎపిడెమియాలజిస్ట్: 1 పోస్టుకు 20 దరఖాస్తులు.

జాతీయ ఆరోగ్య మిషన్ కింద చేపడుతున్న ఈ నియామకాల ద్వారా ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.