Hanumakonda: 31వ డివిజన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభం

Hanumakonda: హనుమకొండ 31వ డివిజన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభం. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటు హక్కుపై అవగాహన కల్పించిన నేతలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Oct 2026 7:43 PM IST
Hanumakonda
X

Hanumakonda: 31వ డివిజన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభం

హనుమకొండ: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ నాయిని రాజేందర్ రెడ్డి గారు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ ఇనుగాల వెంకట్రాంరెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పిసిసి రాష్ట్ర పీసీసీ మెంబర్ రాష్ట్ర పిసిసి మెంబర్ బట్టి శీనన్న గారి సూచన మేరకు 31వ డివిజన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా తాజా మాజీ కార్పొరేటర్ గౌరవ మామిండ్ల రాజు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, అర్హులైన ప్రతి పట్టభద్ర ఓటరును కలిసి ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

31వ డివిజన్ అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం!

గతంలో జరగని పలు అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నర సంవత్సరాల పాలనలో న్యూ శాయంపేట ప్రాంతంలో ముందుకు సాగుతున్నాయని మామిండ్ల రాజు గారు పేర్కొన్నారు. గ్రామీణ వాతావరణం నుంచి ఆధునిక పట్టణ రూపురేఖల దిశగా న్యూ శాయంపేటను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి గల్లీలో నాణ్యమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణంతో పాటు పలు మౌలిక వసతుల పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు భరోసా!

నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చే దిశగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఆరోగ్యశాఖ , ఇంజినీరింగ్ తదితర శాఖల్లో ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పట్టభద్రులకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ప్రతి అర్హుడైన పట్టభద్రుడిని కలుస్తూ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించి న వివరాలను ప్రజలకు చేరవేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం, యువతకు ఉపాధి అవకాశాలు, స్థానిక అభివృద్ధి వంటి అంశాలపై పట్టభద్రులతో చర్చిస్తూ ఎన్నికల ప్రచారాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు .

తాజా మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు గారి సందేశం:

“ప్రజా సమస్యల పరిష్కారం, యువత భవిష్యత్తు, న్యూ శాయంపేట అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలి. అర్హులైన ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి.

ఈ కార్యక్రమంలో డివిజన్ఇన్చార్జి మార్క విజయ్ గారు డివిజన్ అధ్యక్షులు సత్తు రమేష్ గారు మాజీ అధ్యక్షులు అంకేశ్వర్ సురేందర్ గారు నాగనబోయిన బాబురావు గారు శీలం శ్రీనివాస్ గారు MLC డివిజన్ ఇన్చార్జి డిసిసి మెంబర్ మామిండ్ల సురేష్ పిండి రమేష్ కనుకుంట్ల కృష్ణ ఏనబోతుల సతీష్ మంద సునీల్ మిట్టపల్లి సంతోష్ వెనకంటి బాలకృష్ణ గండ్రతి యాదగిరి బొల్లెన యాదగిరి వెనుకంటి రాకేష్ బొల్లం పున్నం చందర్ వేల్పుల ప్రవీణ్ కోరుగొప్పుల సంజీవ మామిండ్ల రమేష్ వెనుకంటి రామ్ ఆరెళ్ళ అభిలాష్ కూర క్రాంతి కైతం గణేష్ మామిడాల సంతోష్ మాచర్ల అనిల్ మరియు డివిజన్ సీనియర్ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్