Hanumakonda: పరకాల చలివాగులో యథేచ్ఛగా ఇసుక దోపిడీ!

Hanumakonda: హనుమకొండ జిల్లా పరకాల చలివాగులో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తోడేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

M PRABHAKAR, PARAKAL
Published on: 13 Oct 2026 10:46 AM IST
Hanumakonda
X

Hanumakonda: పరకాల చలివాగులో యథేచ్ఛగా ఇసుక దోపిడీ!

Hanumakonda: పరకాల చలివాగులో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికారుల అండదండలతోనే యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వందల ట్రాక్టర్లతో దోపిడీ:

చలివాగులో రాత్రింబవళ్లు వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తోడేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ. వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వాగు మొత్తం గుంతలమయంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిద్రపోతున్న అధికారులు:

ఇదంతా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

వాగులో నీటి ప్రవాహానికి ఆటంకం కలగడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ అక్రమ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL