Hanumakonda: కాజీపేటలో బిజెపి రావు పద్మారెడ్డి ధ్వజం!

Hanumakonda: యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కాజీపేట జంక్షన్‌లో బీజేవైఎం నిరసన. 2 లక్షల ఉద్యోగాలు, రూ.4000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని రావు పద్మారెడ్డి డిమాండ్.

Narender, Staff Reporter  -Warangal
Published on: 17 Oct 2026 5:50 PM IST
Hanumakonda
X

Hanumakonda: కాజీపేటలో బిజెపి రావు పద్మారెడ్డి ధ్వజం!

హనుమకొండ: యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేర్చకుండా తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. - బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ కాండిడేట్ శ్రీమతి రావు పద్మ రెడ్డి. యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ కాండిడేట్ శ్రీమతి రావు పద్మ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, BJYM హనుమకొండ జిల్లా అధ్యక్షులు పున్నం వేణు గారి ఆధ్వర్యంలో శనివారం కాజీపేట జంక్షన్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి రావు పద్మ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా రావు పద్మ రెడ్డి గారు మాట్లాడుతూ

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని, నెలకు ₹4,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, రాజీవ్ యువ వికాసం కార్డు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

హామీలు ఇవ్వడం కాదు... వాటిని అమలు చేసే వరకు తెలంగాణ యువత పక్షాన బిజెవైఎం పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు.

రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేసి ‘ఓట్ చోరీ’ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. గాంధీ పేరును దొంగిలించిన నకిలీ గాంధీలు కాంగ్రెస్ నేతలని వ్యాఖ్యానించారు. భారత అభివృద్ధిని జీర్ణించుకోలేక, ప్రపంచ వేదికపై భారత్ అగ్రశక్తిగా ఎదుగుతుంటే తట్టుకోలేక దేశంలో అశాంతి సృష్టించేందుకు రాజ్యాంగబద్ధ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.

"ఎన్నికలే అక్రమమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయడం లేదు? గెలిస్తే ఈవిఎంలు, ఎన్నికల సంఘం మంచివి... ఓడిపోతే మాత్రం అవే తప్పు అనడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం" అని అన్నారు.

గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే, నేడు కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి మరియు ఆయన సోదరులు లాభపడుతున్నారని ఆరోపించారు. కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని, తెలంగాణను కాపాడి అభివృద్ధి బాటలో నడిపించే సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి, బిజెవైఎం జిల్లా నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.