Hanumakonda: పరకాలలో లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు!

Hanumakonda: పరకాల లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి విద్యార్థినుల సందడి.

M PRABHAKAR, PARAKAL
Published on: 9 Oct 2026 3:18 PM IST
Hanumakonda
X

Hanumakonda: పరకాలలో లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు!

Hanumakonda: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాఠశాల విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణాకర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల్లో సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంచడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL