Hanamkonda: హనుమకొండలో పూలే చిత్రపటానికి వినయ్ భాస్కర్ నివాళులు

Hanamkonda: బాలసముద్రం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు; చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన దాస్యం వినయ్ భాస్కర్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Nov 2026 5:26 PM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండలో పూలే చిత్రపటానికి వినయ్ భాస్కర్ నివాళులు

హనుమకొండ: బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) హనుమకొండ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్,మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్.

ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో సామాజిక సమానత్వం,విద్య,మహిళా సాధికారత,అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు.సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

మహిళలకు విద్య అందించడంలో, అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించడంలో పూలే దంపతులు చూపిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.సమానత్వం,సామాజిక న్యాయం,విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు.

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్