Hanamkonda: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి

Hanamkonda: హన్మకొండలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమీక్ష. అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 22 Sept 2026 10:43 PM IST
Hanamkonda
X

Hanamkonda: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి

హన్మకొండ: అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసేందుకు..క్షేత్రస్థాయి పరిశీలనను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, చేయూత పెన్షన్ ల మీద మంగళవారం కలెక్టరెట్ లోని మినీ కాన్ఫెరెన్స్ హాల్ లో సంబంధిత అధికారులతో కలెక్టర్ చాహత్ బాజ్ పాయి రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...

రెండవ విడత కీ సంబందించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం గా, పారదర్శకంగా జరగాలని అన్నారు. రెండవ విడత లో భాగం గా.. గుడిసెల్లో, తాత్కాలిక నివాసాల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో.. ఇందుకు సంబందించిన ప్రక్రియ త్వరగా కావాలని ఎంపీడీఓ లను కలెక్టర్ ఆదేశించారు.

చేయూత పెన్షన్స్ మీద మాట్లాడుతూ...కొత్త పెన్షన్ మంజూరి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈ నెల 25వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు.

వీబి జీ రామ్ జీ లో భాగం గా.. గ్రామీణ కమిటీల ద్వారా త్వరగా పనులను గుర్తించాలాన్నారు. ఏల్ నీనో ప్రభావం దృష్ట్యా...జలసిరి కార్యక్రమంలో భాగంగా నీటి నిల్వల పనులను గుర్తించి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశం లో DRDO పీడీ మేన శ్రీను, హోసింగ్ పీడీ సిద్దార్థ నాయక్, అన్నీ మండలాల ఎంపీడీఓ లు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.