Hanamkonda: క్యాన్సర్ బాధిత బాలుడికి రూ. 5 లక్షల ఎల్ఓసీ చెక్కు అందజేసిన ఎంపీ కావ్య
Hanamkonda: హనుమకొండకు చెందిన క్యాన్సర్ బాధిత బాలుడికి రూ.5 లక్షల LOC మంజూరు చేయించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. క్యాంపు కార్యాలయంలో చెక్కు అందజేత.
Hanamkonda: క్యాన్సర్ బాధిత బాలుడికి రూ. 5 లక్షల ఎల్ఓసీ చెక్కు అందజేసిన ఎంపీ కావ్య
హనుమకొండ: హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ అనే బాలుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా, అతని చికిత్స కోసం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక శ్రద్ధ వహించి రూ.5 లక్షల రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించారు.
మంజూరైన ఎల్ ఓ సి నీ మంగళవారం కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపత్కాలంలో తమకు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి బాధిత కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.




