Hanamkonda: ప్రసూతి ఆసుపత్రిలో సహాయకుల వెయిటింగ్ హాల్ ప్రారంభం
Hanamkonda: హన్మకొండ ప్రసూతి ఆసుపత్రిలో పేషంట్ల సహాయకుల వెయిటింగ్ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.
Hanamkonda: ప్రసూతి ఆసుపత్రిలో సహాయకుల వెయిటింగ్ హాల్ ప్రారంభం
హనుమకొండ: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పేషంట్ల సహాయకుల వెయిటింగ్ హాలును జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అధికారుల సమక్షంలో ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వెయిటింగ్ హాల్‌ను అన్ని వసతులతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.
మంగళవారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో పేషంట్ల సహాయకుల వెయిటింగ్ హాలును జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, తదితరుల సమక్షంలో ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏళ్ల తరబడి రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మెప్మా, జీడబ్ల్యూఎంసి ఆధ్వర్యంలో వెయిటింగ్ హాల్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఆసుపత్రికి వచ్చే పేషంట్లు, వారి సహాయకులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా వెయిటింగ్ హాలు ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ ఆసుపత్రితో తనకు ఎంతో అనుబంధం ఉందని, తాను కూడా ఇక్కడే జన్మించానని తెలిపారు.ఈ ఆసుపత్రికి చారిత్రక ప్రాధాన్యం ఉందని, ఎంతోమంది ప్రముఖులు, మేధావులు ఇక్కడే జన్మించారని గుర్తుచేశారు. అందువల్ల ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఆర్ ఎం ఓ లు, పి పిపి యూనిట్ సిబ్బంది, బ్లడ్ బ్యాంక్, మదర్ మిల్క్ బ్యాంకు సిబ్బంది, పేషంట్ల అటెండెంట్లు,ప్రజలు పాల్గొన్నారు.




