Hanamkonda: రెడ్ క్రాస్ రాష్ట్ర సభ్యుడిగా ఎన్నికైన ఈవీ శ్రీనివాస్ రావు

Hanamkonda: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర పాలక మండలి సభ్యుడిగా ఎన్నికైన ఈ.వి. శ్రీనివాస్ రావును ఫూలే ఆశయ సాధన సమితి నాయకులు సత్కరించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 30 Sept 2026 8:55 PM IST
Hanamkonda
X

Hanamkonda: రెడ్ క్రాస్ రాష్ట్ర సభ్యుడిగా ఎన్నికైన ఈవీ శ్రీనివాస్ రావు

హనుమకొండ: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర పాలక మండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఇ.వి. శ్రీనివాస్ రావును ఫూలే ఆశయ సాధన సమితి (PASS) ఆధ్వర్యంలో హనుమకొండలోని హరిత కాకతీయలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఇ.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, తనపై విశ్వాసంతో రాష్ట్ర పాలక మండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి, సమాజంలోని ప్రతి వర్గానికి సేవలు చేరేలా సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు.

రక్తదానం, ఆరోగ్య సేవలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సేవా స్ఫూర్తిని మరింత విస్తరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్, PASS జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ నల్లాని శ్రీనివాస్, రెడ్డి జాగృతి నాయకులు గుర్రం ప్రభాకర్ రెడ్డి, రెంటాల కేశవరెడ్డి తదితరులు పాల్గొని ఇ.వి. శ్రీనివాస్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST