Hanamkonda: కిట్స్ కాలేజ్ వద్ద గణనాథుడిని దర్శించుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
Hanamkonda: హన్మకొండ కిట్స్ కాలేజ్ వద్ద గణనాథుడిని దర్శించుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి. అన్నదాన కార్యక్రమం ప్రారంభం.
Hanamkonda: కిట్స్ కాలేజ్ వద్ద గణనాథుడిని దర్శించుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
హన్మకొండ: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హన్మకొండ మొదటి డివిజన్ ఎర్రగట్టు గుట్ట సమీపంలోని కిట్స్ కాలేజ్ వద్ద కిట్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువుదీరిన ఘననాథుడిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. వినాయక నవరాత్రులు ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని, ఆ లంబోదరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కిట్స్ యూత్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు చిర్ర రాము గౌడ్, దేవరకొండ అనిల్, వీసం సురేందర్ రెడ్డి, గరిగే రాజు, డబ్బ శ్రీను మరియు కిట్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




