Hanamkonda: వినాయక నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమీక్ష

Hanamkonda: హన్మకొండలో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి. షిఫ్టుల వారీగా నోడల్ అధికారుల నియామకం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 22 Sept 2026 10:34 PM IST
Hanamkonda
X

Hanamkonda: వినాయక నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమీక్ష

హన్మకొండ: ఈ నెల 23 న ( రేపు ) జరిగే వినాయక నిమజ్జనం సందర్బంగా అధికారులు సమన్వయముగా పని చేసి జిల్లా లో ప్రశాంత వాతావరణం లో నిమజ్జన ప్రక్రియ పూర్తి అయ్యేలా పని చేయాలనీ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు

వినాయక నిమజ్జనం ఏర్పాట్ల మీద మంగళవారం కలెక్టర్ చాహత్ బాజ్ పాయి...అదనపు కలెక్టర్ రవి,Gwmc కమిషనర్ వెంకన్న, ఆర్డీవో లు, డీసీపీ లు, ఏసీపీ లు,రెవిన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి ఇరిగేషన్, విద్యుత్, మత్స్య, వైద్య మొదలగు శాఖల అధికారులతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించి పలు సూచనలును తెలిపారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లా లో వినాయక నిమజ్జనం అయ్యే ప్రతీ చోట అధికారులు అలర్ట్ గా ఉండి. నిమజ్జనం ప్రక్రియ సాఫిగా జరిగేలా బాధ్యత గా వ్యవహారించాలన్నారు.

అన్నీ చోట్ల క్రెన్స్ అందుబాటులో పెట్టాలన్నారు. లైటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జనరేటర్స్ లను కుడా అందుబాటులో పెట్టుకోవాలన్నారు. తాగు నీరు సదుపాయం , లైఫ్ జాకెట్స్, గజ ఈతగాళ్లు ఉండాలన్నారు. నిమజ్జనం పాయింట్ ల వద్ద డ్యూటీ ఉన్న ప్రతీ అధికారి నిమజ్జనం పూర్తి అయ్యే వరకు అలర్ట్ గా ఉండాలన్నారు.

నిమజ్జనం ప్రక్రియ ని పర్యవేక్షణ చేయడానికి నోడల్ అధికారులను నియమించామన్నారు.. వారందరు తమ విధులను సరిగ్గా నిర్వహించాలన్నారు. నిమజ్జనం చోటు కీ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు ఉండాలన్నారు

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.