Hanamkonda: పుట్టబోయే ప్రతీ బిడ్డకు హెచ్‌ఐవీ రహిత జీవితం అందించాలి

Hanamkonda: పుట్టబోయే బిడ్డకు హెచ్‌ఐవీ రహిత జీవితం అందించడమే లక్ష్యమని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. గర్భిణులకు హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి చేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 30 Oct 2026 8:38 PM IST
Hanamkonda
X

Hanamkonda: పుట్టబోయే ప్రతీ బిడ్డకు హెచ్‌ఐవీ రహిత జీవితం అందించాలి

హనుమకొండ: పుట్టబోయే ప్రతి బిడ్డకు హెచ్‌ఐవీ వైరస్ సోకకుండా నివారించి, హెచ్‌ఐవీ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయడమే ప్రధాన లక్ష్యమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన సమ్మాన్–సమారోహ్, ఈవీటీఎస్ క్లినికల్ ఆడిట్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, గర్భిణీ స్త్రీలకు నిర్వహిస్తున్న పరీక్షలు, చికిత్సాt విధానాలు, తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిశితంగా సమీక్షించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలకు గర్భధారణ ప్రారంభ దశలోనే యాంటినేటల్ కేర్ (ఏఎన్‌సీ) పరీక్షల్లో భాగంగా హెచ్‌ఐవీ, సైఫిలిస్ , HBsAg పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.

ప్రసవానికి ముందు కూడా అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి సకాలంలో తగిన వైద్య చికిత్స అందించాలన్నారు. హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గర్భిణీలకు యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) మందులు క్రమం తప్పకుండా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్‌ఏసీపీ-5) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. హెచ్‌ఐవీ ఉన్నవారిని గుర్తించడం, గుర్తించిన వారందరికీ ఏఆర్‌టీ చికిత్స అందించడం, వైరల్ లోడ్‌ను నియంత్రణలో ఉంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఎయిడ్స్ సురక్ష ప్లస్ (MAS) కార్యక్రమం ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

గర్భిణీ స్త్రీలకు హెచ్‌ఐవీతో పాటు సిఫిలిస్, హెపటైటిస్ బి (HBsAg) పరీక్షలను కూడా నిర్వహించాలని.. వీటిని త్రివిధ వ్యాధుల నివారణ విధానంలో భాగంగా పరిగణించి, అవసరమైన చికిత్స అందించాలన్నారు. తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ, సిఫిలిస్ వంటి వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లాలో ఏప్రిల్ 2026 నుంచి ఇప్పటివరకు సుమారు 10296వేల మంది గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించామని సమావేశంలో వైద్యాధికారులు, కలెక్టర్ కు వివరించారు. ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వచ్చే సమాచారాన్ని కూడా సమగ్రంగా సేకరించి వలస కార్మికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జిల్లాలో నివసిస్తున్న వారి ఆరోగ్య వివరాలను కూడా గుర్తించి, అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో అందుబాటులో ఉన్న సమాచార వ్యవస్థలు, ఆరోగ్య గణాంకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, హెచ్‌ఐవీతో పాటు syphilis, HbSAg షుగర్ వంటి అసంక్రమిత వ్యాధుల నియంత్రణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రతి వైద్యాధికారి, క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన లక్ష్యాలు, బాధ్యతలు కేటాయించి, పనితీరును నిరంతరం సమీక్షించాలన్నారు. హెచ్‌ఐవీ నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తూ, పుట్టబోయే ప్రతి బిడ్డకు హెచ్‌ఐవీ రహిత జీవితాన్ని అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా జిల్లాను సురక్ష జిల్లాగా తీర్చిదిద్దిన క్రమంలో వైద్యాధికారులను కలెక్టర్ జ్ఞాపికలు అందజేసి, సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శేషాద్రి,వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, అడిషనల్ DMHO Dr. మదన్మోహన్ Rao, Dr. విజయలక్ష్మి GMH సూపరింటెండెంట్, DWO విశ్వజ,NCD ప్రోగ్రామ్ ఆఫీసర్ గ్యానేశ్వర్, MCH PO Dr. రజిత ART Senior మెడికల్ ఆఫీసర్ Dr. సూర్య ప్రకాష్, Dr. రవి supt. Chest హాస్పిటల్, Dr. వంశీ కృష్ణ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ స్వప్న మాధురి, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు ఇతర వైద్యాధికారులుతదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.