Hanamkonda: కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్!

Hanamkonda: హనుమకొండ జిల్లా కమలాపూర్ సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 30 Oct 2026 1:29 PM IST
Hanamkonda
X

Hanamkonda: కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్!

Hanamkonda: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని CHC,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.

శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని CHC, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా హాస్పిటల్ కి ప్రతిరోజు ఎంతమంది ఓపి సేవల నిమిత్తం వస్తుంటారని, పేషెంట్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని మేల్, ఫిమేల్ వార్డులను, ఓపి నమోదును కలెక్టర్ పరిశీలించారు.

టీకాల గది, మెడికల్ రికార్డు విభాగం, మెడికల్ స్టోర్ ను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది హాజరు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని రిజిస్టర్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ... రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.

వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులకు ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. పేషంట్లకు అవసరమైన అన్ని సదుపాయాలు ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.మందుల నిర్వహణ సరిగ్గా ఉండాలన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.