Hanamkonda: టీబీ ముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Hanamkonda: హన్మకొండలో టీబీ ముక్త్ భారత్ సమన్వయ సమావేశం. హై రిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, స్క్రీనింగ్ పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆదేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 22 Sept 2026 10:37 PM IST
Hanamkonda
X

Hanamkonda: టీబీ ముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

హనుమకొండ: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం పై జిల్లాస్థాయి సమన్ వయ కమిటీ సమావేశం. టీబీ ముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.

మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... టీబీ నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో నిర్వహించే స్క్రీనింగ్ కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టి, వ్యాధి లక్షణాలు ఉన్న వారిని త్వరగా గుర్తించి తగిన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.

ముఖ్యంగా హై రిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అనుమానితులను గుర్తించి అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించి కార్యక్రమం అమలు తీరును సమీక్షించాలన్నారు.

టీబీ నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. హై రిస్క్ కేసులను నిరంతరం పర్యవేక్షిస్తూ, వారికి అవసరమైన పరీక్షలు, చికిత్స, మందుల వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. టీబీ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా మరింత సమర్థవంతంగా నియంత్రించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు డాక్టర్ మన్మోహన్ రాజు 50 న్యూట్రిషన్ కిట్లకు అయ్యే ఖర్చు 35 వేల రూపాయలను అందజేయగా , సామాజిక బాధ్యతలో భాగంగా టీబి &చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి రవి 10 న్యూట్రిషన్ కిట్లు,పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాయంపేటలో పనిచేస్తున్న బి.మల్లేశం 10 న్యూట్రిషన్ కిట్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఐదు న్యూట్రిషన్ కిట్స్, డిప్యూటీ DMHO, డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఐదు న్యూట్రిషన్ కిట్స్ ను...టీబి తో బాధపడుతున్నటు వంటి వారికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గిరిరాజ్ గౌడ్ ,జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి రమాకాంత్, కాకతీయ వైద్య కళాశాల ఎస్.పి.ఎం డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.