Hanamkonda: ‘ఆగండి – ఆలోచించండి – అడుగువేయండి’: సీఐ బాబులాల్!
Hanamkonda: హనుమకొండ జిల్లా హౌస్ బుజుర్గ్‌లో సైబర్ నేరాలపై ఫ్లాష్ వాక్ ఆత్మకూర్ సీఐ బాబులాల్ అవగాహన ‘డిజిటల్ అరెస్ట్’ ఉండదని, 1930 హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించాలని స్పష్టీకరణ.
Hanamkonda: ‘ఆగండి – ఆలోచించండి – అడుగువేయండి’: సీఐ బాబులాల్!
హనుమకొండ జిల్లా: ఆత్మకూర్ ఇన్‌స్పెక్టర్ బాబులాల్ గారు మండలంలోని హౌస్ బుజుర్గ్ గ్రామంలో సైబర్ నేరాలను అరికట్టడంలో భాగంగా “ఫ్లాష్ వాక్” కార్యక్రమాన్ని నిర్వహించారు. “ఆగండి – ఆలోచించండి – అడుగువేయండి” అనే థీమ్‌తో గ్రామ ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు.
సైబర్ నేరాలకు గురికావద్దని, తెలియని వ్యక్తులకు OTP వివరాలు వెల్లడించవద్దని, ఆన్‌లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే “డిజిటల్ అరెస్ట్” అనేది లేదని, ఎవరైనా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరిస్తే మోసపోవద్దని తెలిపారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది గ్రామస్థులు, SI తిరుపతి, గ్రామ సర్పంచ్ మౌలా, కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




