Warangal: భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలి!
Warangal: వరంగల్‌లో అక్టోబర్ 10 నుంచి ప్రారంభంకానున్న బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జీడబ్ల్యూఎంసి కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు
Warangal: భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలి!
Warangal: అక్టోబర్ 10వ తేదీ నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, గతంలో మాదిరిగానే నగరంలోని ఆయా ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణకు పకడ్బందీగా
ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిడబ్ల్యూఎంసి కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై కమిషనర్ వెంకన్న సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ
జీ డబ్ల్యూ ఎం సి పరిధిలోని 66 డివిజన్లలో బతుకమ్మ వేడుకలు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా
ఈ నెల 18న బతుకమ్మ, 20న దసరా పండుగల వేడుకలు జరిగే పద్మాక్షి, భద్రకాళి, వేయి స్తంభాల గుడి, గుండుచెరువు, బంధం చెరువు, పెద్దచెరువు, హసన్‌పర్తి, ఉర్స్ గుట్ట రంగసాయిపేట, శివనగర్, తోట మైదాన్, చిన్నవడ్డేపల్లి, కాశిబుగ్గ తదితర ప్రాంతాల్లో
తదితర ప్రాంతాల్లో ప్రజల రద్దీకి అనుగుణంగా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఫాగింగ్, శానిటేషన్ స్ప్రేయింగ్ చేపట్టడంతో పాటు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. సద్దుల బతుకమ్మ రోజున నిమజ్జన ప్రాంతాల్లో అదనపు పారిశుద్ధ్య సిబ్బందితో పూలు, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు.
వీధి దీపాల మరమ్మతులు, హైమాస్ట్ లైట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని, భద్రకాళి, పద్మాక్షి, వేయి స్తంభాల గుడి, రంగసాయిపేట, శివనగర్, తోట మైదాన్, చిన్నవడ్డేపల్లి, కాశిబుగ్గ తదితర
పరిసరాల్లో అదనపు వెలుగులు కల్పించాలని సూచించారు.
భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు, పార్కింగ్ వసతులు కల్పించాలని, అవసరమైన చోట గ్రావెల్, మట్టి ఫిల్లింగ్ చేసి పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేయాలని అన్నారు.
ఉత్సవాల ప్రారంభానికి ముందే ‘గుర్రపు డేక్క తొలగించి ప్రధాన ప్రాంతాలన్నింటినీ పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కమిషనర్ స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సమన్వయంతో పనిచేసి ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ఉత్సవ వాతావరణం కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, డీఎఫ్‌ఓ శంకర్‌లింగం, ఎస్‌ఎఫ్‌ఓ రాజేశ్వరరావు, ఈఈలు రవికుమార్, సంజయ్‌కుమార్, మహేందర్, ఎంటమాలజిస్ట్ రజని తదితరులు పాల్గొన్నారు.




