Warangal: వరంగల్ బల్దియా కార్యాలయంలో ఘనంగా బాపూజీ 111వ జయంతి వేడుకలు!
Warangal: వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు. చిత్రపటానికి నివాళులర్పించిన అదనపు కమిషనర్ జోనా.
Warangal: వరంగల్ బల్దియా కార్యాలయంలో ఘనంగా బాపూజీ 111వ జయంతి వేడుకలు!
Warangal: మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో జయంతి వేడుకలు నిర్వహించారు. అదనపు కమిషనర్ జోనా, అధికారులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ జోనా మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని సైతం త్యజించిన నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయన సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్, సీఎంహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు, ఆరోగ్యాధికారి డా. రాజేష్, హార్టికల్చర్ అధికారి ప్రశాంత్, సూపరింటెండెంట్లు బాకం సంతోష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.




