Gudur: గూడూరులో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయానికి స్థలం కేటాయించాలి!
Gudur: గూడూరు మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయానికి స్థలం కేటాయించాలని సర్పంచ్ సునీత, డిప్యూటీ తహసీల్దార్ కోమలకు గిరిజన నాయకులు వినతిపత్రం ఇచ్చారు.
Gudur: గూడూరులో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయానికి స్థలం కేటాయించాలి!
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ ఈరోజు గూడూరు గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్ గారికి మరియు గూడూరు తహసిల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా గిరిజన నాయకులు బానోత్ లక్ష్మణ్ నాయక్, హంసావత్ శ్రీనివాస్ నాయక్ ,భూక్య బాలు నాయక్, అంగోత్ ధర్మానాయక్ మాట్లాడుతూ.గూడూరు మండలం ఏజెన్సీ ప్రాంతంలో అతిపెద్ద మండలం అని, ఇక్కడ అత్యధికంగా లంబాడీ గిరిజనులు నివసిస్తున్నారని, అయినప్పటికీ గూడూరు హెడ్ క్వార్టర్ లో మా ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ ఆలయం లేకపోవడం బాధాకరమని అన్నారు.
గూడూరు కేంద్రంలో వివిధ కులాల దేవతల ఆలయాలు, నాయకుల విగ్రహాలు ఉన్నాయని, దానికి మేము సంతోష పడుతూ అదే తరహాలో మా బంజారా జాతి గౌరవ ప్రతీక అయిన సేవాలాల్ మహారాజ్ ఆలయానికి కూడా మెయిన్ రోడ్డులో స్థలం కేటాయించి, లంబాడీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని సర్పంచ్ గారిని, తహసిల్దార్ గారిని కోరినట్లు ఈ కార్య నిర్వాహకులు డాక్టర్ వి గోపీనాథ్ తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సునీత కొమ్మాలు గారు మాట్లాడుతూ తప్పకుండా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మరియు మేరామ యాడి గుడులను నిర్మించుటకు స్థలం కొరకు నా వంతుగా నేను తప్పకుండా సహాయ సహకారాలు అందించి గుడి నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అవుతానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ కోమల మేడం గారికి వినతి పత్రం అందిస్తూ మాజీ సర్పంచ్ నునావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ మా గిరిజన లంబాడీల కొరకు సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం చేయుటకు రెవెన్యూ పరంగా స్థలం కేటాయించాలని దానితోపాటు కమ్యూనిటీ హాల్ కూడా ఉండాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో హరిచంద్రు తండా సర్పంచి వీరన్న, మాజీ సర్పంచ్ అజ్మీర లాల్ సింగ్, శ్రీ వాల్య నంద స్వామి ,బోడ మంగి లాల్, ఫుల్సింగ్, నునావత్ వీరన్న, జాటోత్ వివేకానంద, భూక్య శ్రీనివాస్ , శ్రీకాంత్, మీడియా మిత్రులు భూక్యా నరసింహ, బోడ రాజు, ఇస్లావత్ చందా బాలాజీ కిషన్ తో పాటు రైతులు విద్యార్థులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు,లంబాడి సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




