Gudur: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి ‘కాయకల్ప’ అవార్డు

Gudur: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి 70.9 శాతం మార్కులతో ప్రతిష్టాత్మక ‘కాయకల్ప’ పురస్కారానికి ఎంపికై రూ. లక్ష నగదు బహుమతి సాధించిందని డాక్టర్ వీరన్న తెలిపారు.

B NARASIMHA, GUDUR
Published on: 16 Oct 2026 5:02 PM IST
Gudur
X

Gudur: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి ‘కాయకల్ప’ అవార్డు

గూడూరు: ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఏటా ఆసుపత్రుల పనితీరును పరిశీలించి, ఉత్తమ సేవలు అందిస్తున్న దవాఖానాలకు కేంద్ర ప్రభుత్వం ‘కాయకల్ప’ పురస్కారాలను ప్రకటిస్తుంది.

తాజాగా ప్రకటించిన కాయకల్ప ఫలితాల్లో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి 70.9 శాతం మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆసుపత్రికి రూ. 1,00,000 (లక్ష రూపాయలు) నగదు బహుమతిగా లభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న తెలిపారు.

8 అంశాల్లో సమగ్ర పరిశీలన కాయకల్ప అవార్డుల ఎంపిక కోసం కేంద్ర బృందం ప్రధానంగా 8 ముఖ్యమైన విభాగాలలో ఆసుపత్రి పనితీరును సమగ్రంగా పరిశీలించింది.

మౌలిక సదుపాయాలు, నిర్వహణ పరిశుభ్రత (పారిశుద్ధ్యం) ఇన్ఫెక్షన్ కంట్రోల్, అంటువ్యాధుల నివారణ, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, చెత్త నిర్వహణ, రోగులకు సేవల అందజేత మరియు సపోర్ట్ సిస్టమ్ వ్యర్థాల సురక్షిత తరలింపు తదితర అంశాలు.

నిధుల వినియోగం ఇలా.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ఈ పురస్కారం ద్వారా వచ్చిన నిధుల్లో: 70% నిధులు: ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు వినియోగిస్తారు.

20% నిధులు: అహర్నిశలు శ్రమించి మెరుగైన సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రోత్సాహకంగా (ఇన్సెంటివ్‌గా) అందిస్తారు.

ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న మాట్లాడుతూ, ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల నిరంతర కృషి వల్లే ఈ గుర్తింపు లభించిందని కొనియాడారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR