Warangal: గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కమిషనర్!
Warangal: గ్రేటర్ వరంగల్ బల్దియా ప్రజావాణిలో కమిషనర్ టి.వెంకన్న 116 అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్ పరిష్కారంలో నిర్లక్ష్యం వీడి గడువులోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Warangal: గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కమిషనర్!
వరంగల్: గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదుల సంబంధ దరఖాస్తులను స్వీకరించి ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావానికి అనుగుణంగా ఆయా విభాగాలకు బదలాయించారు.
గ్రీవెన్స్ దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని, జాప్యాన్ని సహించేది లేదని అధికారులకు సూచించారు. నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గత వారం ప్రజావాణిలో స్వీకరించిన వినతుల పరిష్కార స్థితిగతులను కమిషనర్ విభాగాల వారీగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను తక్షణమే పరిష్కరించడంతో పాటు, తీసుకున్న చర్యలను సంబంధిత ఫిర్యాదుదారులకు తెలియజేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో అనవసర జాప్యం జరిగితే సంబంధిత అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని,ప్రజలకు అందించే ప్రతి పౌర సేవలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు.
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల వివరాలు:
టౌన్ ప్లానింగ్ – 51 , ఇంజినీరింగ్ – 46 , ఆరోగ్యం, పారిశుద్ధ్యం – 11, రెవెన్యూ – 06, హార్టికల్చర్ – 01, నీటి సరఫరా...01, మొత్తం 116 దరఖాస్తులు, ఈ కార్యక్రమంలో ఇంచార్జి అదనపు కమిషనర్ సమ్మయ్య, సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్‌కుమార్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్,ముఖ్య హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, సెక్రటరీ అనిల్‌బాబు, పన్నుల అధికారి రామకృష్ణ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.




