Warangal: నరకాసుర వధకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కమిషనర్ వెంకన్న!

Warangal: ఉర్సు రంగలీల మైదానంలో జరగనున్న నరకాసుర వధ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని, సిబ్బంది వాకీటాకీలు వాడాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 2 Nov 2026 5:42 PM IST
Warangal
X

Warangal: నరకాసుర వధకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కమిషనర్ వెంకన్న!

వరంగల్: దీపావళి సందర్భంగా ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించనున్న నరకాసుర వధ కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం కౌన్సిల్ హాల్‌లో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమైన కమిషనర్ మాట్లాడుతూ, కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు, లైటింగ్, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

ఏర్పాట్లన్నింటినీ కాశీబుగ్గ డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షించాలని ఆదేశించారు. అదేవిధంగా , విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన వాకీటాకీలను తప్పనిసరిగా వినియోగించాలని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు ఇచ్చే సూచనలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా సమన్వయంతో విధులు నిర్వహించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కమిషనర్ సమ్మయ్య, ఎస్‌ఈ రాజ్‌కుమార్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ముఖ్య ఉద్యానవన అధికారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, కార్యదర్శి అనిల్‌బాబు, పన్నుల అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST