Palwancha: పాల్వంచ విద్యుత్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
Palwancha: పాల్వంచ విద్యుత్ ఎంప్లాయిస్ కాలనీలో విద్యుత్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
Palwancha: పాల్వంచ విద్యుత్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
Palwancha: బతుకమ్మ పాటలు.. ఆడబిడ్డల కేరింతలతో పాల్వంచ విద్యుత్ ఎంప్లాయిస్ కాలనీలో ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొంది.
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం విద్యుత్ ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రతీ ఇంట్లో మహిళలు, యువతులు తీరొక్క రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, పసుపు కుంకుమతో తయారు చేసిన గౌరమ్మను పూజించారు.
సాయంత్రం నుంచి రాత్రి వరకు మహిళలు బతుకమ్మ పాటలతో పాటు డీజే పాటలతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు. "చిత్తు చిత్తు బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ.. ఒక్కేసి పువ్వేసి చందమామ..." అంటూ ఆడిపాడారు. అనంతరం చింతల చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ వేడుకలలో విద్యుత్ ఎంప్లాయిస్ కాలనీ మహిళలతో పాటు పరిసర ప్రాంత మహిళలు పాల్గొన్నారు.




